Hyderabad, ఏప్రిల్ 3 -- Dil Raju Production 60th Movie With Ashish: ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ 60వ ప్రొడక్షన్‌ని అనౌన్స్ చేశారు. ఇది వారి విజయవంత చిత్ర నిర్మాణ ప్రయాణంలో మెయిన్ మైల్ స్టోన్‌ని సూచిస్తుంది. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా దిల్ రాజు సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు.

ఈ సమయంలో తన ప్రొడక్షన్స్‌లో 60వ మూవీగా వచ్చే సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు బ్యానర్ 60వ సినిమాలో రౌడీ బాయ్స్, లవ్ మీ చిత్రాలతో పేరు తెచ్చుకున్న ఆశిష్ హీరోగా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌తో కొత్త దర్శకుడు ఆదిత్యరావు గంగాసాని డెబ్యు డైరెక్టర్‌గా పరిచయం కానున్నారు.

ఈ 60వ మూవీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. ఆశిష్ లోకల్ బాయ్‌గా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యం కథకు రగ్గడ్ అండ్ గ్రిట్టీ ఎట్మాస్పియర్‌తో ఇ...