భారతదేశం, మార్చి 5 -- టాలీవుడ్ బడా నిర్మాత దిల్‍రాజు ప్రొడ్యూజ్ చేసిన గేమ్ ఛేంజర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన ఈ మూవీ ఈ ఏడాది జనవరి 12న రిలీజై బాక్సాఫీస్ అంచనాలను అందుకోలేకపోయింది. క్రేజీ కాంబినేషన్‍తో వచ్చిన ఈ చిత్రం పెద్దగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. అయితే, విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీని కూడా దిల్‍రాజే నిర్మించారు. ఆ చిత్రం అదే పండుగకు వచ్చి భారీ బ్లాక్‍బస్టర్ అయింది. ఈ పరిణామాల క్రమంలో నేడు (మార్చి 5) ఓ మీడియా సమావేశంలో దిల్‍రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

ప్రస్తుతం రిజల్ట్ కోసం సినిమా రిలీజ్ కావాల్సిన అవసరం లేదని, ఆన్‍లైన్‍(సోషల్ మీడియా)లో ట్రెండ్ పరిశీలిస్తే రేంజ్ తెలుస్తోందని దిల్‍రాజు చెప్పారు. ఎంత పెద్ద స్టార్ అయినా సినిమాలక...