భారతదేశం, ఫిబ్రవరి 1 -- Dil Raju: కాంబినేషన్స్‌ను న‌మ్ముకొని గత నాలుగైదు ఏళ్ళుగా నిర్మాత‌గా తాను తడబడుతున్నాన‌ని నిర్మాత దిల్ రాజు అన్నాడు. సంక్రాంతికి వ‌స్తున్నాం స‌క్సెస్ త‌న‌కు విలువైన పాఠాలు నేర్పింద‌ని చెప్పాడు. వెంక‌టేష్ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సంక్రాంతికి వ‌స్తున్నాం బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ వేడుక శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

ఈ వేడుక‌లో దిల్‌రాజు మాట్లాడుతూ "సాధారణంగా డిస్ట్రిబ్యూటర్స్ కి బ్రేక్ ఈవెన్ అయితేనే సూపర్ హిట్ అని చెప్పుకునే పరిస్థితి నెలకొంది. వాళ్ళు నష్టపోయినప్పుడు కూడా సినిమా సూపర్ హిట్ పోస్టర్స్ పడుతున్నాయి. కల్చర్ మారిపోయింది. సినీ ప‌రిశ్ర‌మ‌లో తొంభై శాతం ఫెయిల్యూర్స్ ఉంటాయి . జస్ట్ ప‌ది శాతం మాత్ర‌మే స‌క్సెస్ ఉన్న ఇండ‌స్ట్రీ ఇది. ...