భారతదేశం, జూన్ 30 -- 2024లో ఉషా రేచల్ థామస్ ముంబైలో డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు కొన్ని మాటలు విన్నారు. అవి ఆమె జీవితాన్నే మార్చేశాయి. "మీరు నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు.. కానీ వైద్యపరంగా చూస్తే, మీరు ఐసీయూలో ఉండాలి." అని ఆ డాక్టర్ ఆమెతో అన్నారు. ఒక సీనియర్ బ్రాండ్ స్ట్రాటజిస్ట్, కమ్యూనికేషన్స్ లీడర్‌గా ఎన్నో ఒత్తిళ్లను, సవాళ్లను ఎదుర్కొన్న ఉషకు.. తన శరీరం నిశ్శబ్దంగా డయాబెటిక్ కోమా వైపు వెళ్తోందని తెలిసినప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు.

ఆమె శరీరంలో పెద్దగా ప్రమాదకరమైన సంకేతాలేవీ కనిపించలేదు. కేవలం అలసట, ఎంత నీళ్లు తాగినా తీరని దాహం, ప్రతీ భోజనం తర్వాత శరీరాన్ని ఆవరించే నీరసం. రెండు నెలల పాటు, ఆమె ఈ లక్షణాలను ఒత్తిడి లేదా వేడి కారణంగా వస్తున్నాయని తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఆమె బ్లడ్ షుగర్ రిపోర్ట్ మాత్రం వేరే కథ చెప్పింది. "గ్లూకోమీటర్...