Hyderabad, మార్చి 31 -- డయాబెటిస్ అనేది ఒక తీవ్రమైన వ్యాధిగానే చెప్పుకోవాలి. దీనిని పూర్తిగా నివారించడం ఎవరి వల్లా కాదు. జీవితాంతం మందులు వాడాల్సిందే. అలాగే ఆహారాన్ని కూడా అదుపులో ఉంచుకోవాల్సిందే. అయితే ఇది వారసత్వంగా వస్తుందని చెప్పుకుంటారు. తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి డయాబెటిస్ ఉంటే వారి పిల్లలకు త్వరగా ఈ వ్యాధి వస్తుందేమోనని ఆందోళన చెందుతారు. ముఖ్యంగా తండ్రికి డయాబెటిస్ ఉంటే కూతురికి వచ్చే అవకాశం ఎక్కువనే వాదన కూడా ఉంది. జన్యుశాస్త్రం ప్రకారం డయాబెటిస్ తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తుందో తెలుసుకుందాం.

వైద్యులు చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తికి డయాబెటిస్ చరిత్ర ఉంటే అతను కూడా డయాబెటిస్ బాధితులుగా మారే అవకాశాలు పెరుగుతాయి. అంటే తండ్రికి మధుమేహం ఉంటే కూతురికి కచ్చితంగా వస్తుందని చెప్పలేము. కానీ వచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. అమెరికన్ డయ...