Hyderabad, మార్చి 10 -- డయాబెటిస్ అనేది నిశ్శబ్దంగా చంపే వ్యాధి. ఒక్కసారి శరీరంలో చేరితే దాన్ని పూర్తిగా నిర్మూలించడం ఎవరితరం కాదు. ఆరోగ్యకరమైన జీవన శైలితో డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవాల్సిందే. ఇది జీవిత నాణ్యతను కూడా తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్న వారిలో ఎక్కువ మంది భుజం నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఈ భుజం నొప్పి వల్ల వారు అప్పుడప్పుడు ఏ పని చేసుకోలేరు.

డయాబెటిక్ రోగులలో దీర్ఘకాలికంగా రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉంటాయి. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఇవి భుజాల దృఢత్వాన్ని కూడా తగ్గిస్తుంది. భుజం కదలికలపై ప్రభావాన్ని చూపిస్తుంది. మధుమేహం ఉన్నవారిలో కండర ద్రవ్యరాశి కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్లే భుజం బలంపైనా, కదలిక పైన చాలా ప్రభావం పడుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్, భుజం నొప్పి ఉండే అవకాశం ఎక్కువ. భుజాలలో నొప్పి వే...