Hyderabad, మార్చి 3 -- సపోటాలు ఏడాది మొత్తం దొరికే పండ్లు కాదు. సీజనల్‌గా దొరికేవి. ఇప్పుడు సపోటా పండ్లు మార్కెట్లో అధికంగా వస్తున్నాయి. వాటిని చూస్తేనే నోరూరిపోతుంది. కానీ డయాబెటిస్ పేషెంట్లు మాత్రం ఏది తిన్నా ముందుగా దాని గ్లైసెమిక్ ఇండెక్స్, వాటిలో ఉండే సహజ చక్కెరల గురించి తెలుసుకున్న తర్వాతే తినాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు సపోటా తినవచ్చో, లేదో తెలుసుకోండి.

సపోటాలు సాధారణంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తిన్న వెంటనే శక్తిని త్వరగా అందిస్తాయి. 100 గ్రాముల సపోటాలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు, చక్కెర, ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, బి కాంప్లెక్స్‌లు, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, కాల్షియం, భాస్వరం వంటివన్నీ ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

మధుమేహం ఉన్నవారు సపోటాలన...