Hyderabad, మార్చి 25 -- డయాబెటిస్... ప్రపంచంలోని ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్యగా మారిపోయింది. డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంతం వెంటాడుతుంది. ప్రతిరోజూ మందులు వాడాల్సిందే. ఇది మీ రక్తంలోని చక్కెర స్థాయిలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాగే డయాబెటిస్ వచ్చినవారు కళ్ల ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. డయాబెటిస్ వల్ల కళ్ళు దెబ్బ తినే అవకాశం కూడా ఉంటుంది. వారు చేసే కొన్ని పనులు కంటికి హానికరంగా మారుతాయి.

డయాబెటిస్ వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయి అనేక సమస్యలకు కారణం అవుతాయి. అధికంగా ఆకలి వేయడం, అధికంగా దాహం వేయడం, తరచుగా మూత్ర విసర్జన చేయడం, తీవ్ర అలసట, మానసిక స్థితిలో మార్పులు... ఇవన్నీ కూడా డయాబెటిస్ వల్ల కలిగేవి. అయితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో పెట్టుకోకపోతే తీవ్రమైన గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యానిక...