Hyderabad, ఫిబ్రవరి 3 -- టీ తాగనిదే రోజును మొదలుపెట్టని వారు ఎంతో మంది. ఇప్పుడు ఎంతో మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. అలాంటివారు ఆహారాన్ని ఎంపిక చేసుకుని తినాలి. పేలవమైన, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. దీనివల్ల జీవనశైలి రోగాలైన డయాబెటిస్ వస్తుంది. డయాబెటిస్ వచ్చిన తర్వాత దాన్ని నిర్వహించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో పొరపాటు చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచడానికి పనిచేస్తుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. డయాబెటిస్ ఉన్న వారు చక్కెర నిండిన టీ తాగకుండా ఉండాలి. అలాంటి వారు బెల్లంతో టీ తాగడం వల్ల ఎటువంటి హాని జరగదని చాలా మంది నమ్ముతారు. అందువల్ల ముఖ్యంగా చలికాలంలో షుగర్ పేషెంట్లు కూడా బెల్లం టీ తాగుతుంటారు. అయితే ఇది నిజంగా వారికి సరైనదో కాదో తెలుస...