భారతదేశం, ఆగస్టు 3 -- హెల్తీ డైట్ అనగానే అందులో కచ్చితంగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. అయితే డయాబెటిక్ పేషెంట్లకు నట్స్, డ్రైఫ్రూట్స్ తినమని చెబుతారు. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్న వారు మాత్రం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ కు దూరంగా ఉండాలి. చాలా డ్రై ఫ్రూట్స్ లో సహజ చక్కెర ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ను వేగంగా పెంచుతుంది. ఇది కాకుండా డ్రై ఫ్రూట్స్ లో కార్బోహైడ్రేట్లు పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లడ్ షుగర్ లెవల్స్ వేగంగా పెరగకూడదనుకుంటే ఈ 8 రకాల డ్రై ఫ్రూట్స్ ను డైట్ లో డయాబెటిస్ వారు చేర్చుకోకూడదు.

ఎండుద్రాక్షలో చాలా పోషకాలు ఉంటాయి, సాధారణ వ్యక్తులకు ఇవి మంచివి. కానీ డయాబెటిస్ విషయానికి వస్తే, ఇందులో ఉండే అధిక స్థాయి సహజ చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతాయి. కాబట్టి ఎండుద్రాక్ష...