Hyderabad, జనవరి 24 -- గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిస్ ఉన్న వారు గుండె కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు డయాబెటిస్ ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో తెలుసుకోండి.

అధిక శరీర బరువు, ముఖ్యంగా మీ పొత్తికడుపు చుట్టూ ఉన్న అదనపు కొవ్వు మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతారు. మీరు మీ బరువులో 5 నుండి 10 శాతం తగ్గితే మీ గుండె ప్రమాదం తగ్గుతుంది. మీ గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉంటుంది.

ప్రతిరోజూ వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది. రోజులో అరగంట పాటూ వాకింగ్ నుంచి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. రక్తపోటును తగ్గించుకోవాలనుకున్నా, బరువు తగ్గాలన్న వ్యాయామాన్ని దినచర్యగా మార్చుకోవాలి. ఇది ఇన్సులిన్ సున్నిత...