Hyderabad, మార్చి 18 -- Dhoni as Animal: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని కూడా యానిమల్ మూవీలో రణ్‌విజయ్ సింగ్ లా మార్చేశాడు తన తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఓ యాడ్ కోసం ధోనీ ఈ లుక్ లో కనిపించడం విశేషం. ఐపీఎల్ రాబోతున్న సమయంలో మన క్రికెటర్లు వింత వింత యాడ్స్ చేస్తున్నారు. తాజాగా ధోనీ ఇలా కనిపించి ఆశ్చర్యపరిచాడు.

ధోనీ ఓ స్టార్ క్రికెటర్ అయినా ఓ మూవీ హీరోకు ఉండాల్సిన లుక్స్ అతని సొంతం. అతనిది మంచి హైట్, పర్సనాలిటీ. అప్పుడప్పుడూ యాడ్స్ రూపంలో తన యాక్టింగ్ టాలెంట్ ను కూడా అతడు బయటపెడుతుంటాడు. తాజాగా మన తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ధోనీ ఓ సైకిల్ బ్రాండ్ కోసం యాడ్ చేశాడు. ఇందులో అతన్ని తన యానిమల్ మూవీలో రణ్‌విజయ్ గా, అర్జున్ రెడ్డిగా మార్చేశాడు సందీప్.

యానిమల్ మూవీలో రణ్‌విజయ్ కారు దిగి తన అనుచరులతో వస్తున్న సీ...