భారతదేశం, మార్చి 22 -- Dhawan in TV Serial: టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం జట్టులో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. ఫామ్ లేమితో గతేడాది వరకు జట్టులోకి వస్తూ పోతున్న మన గబ్బర్.. డిసెంబరులో జరిగిన బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ తర్వాత అతడిని సెలక్టర్లు పూర్తిగా పక్కన పెట్టేశారు. అప్పటి వరకు రోహిత్ లేని సమయంలో కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు.. ఇప్పుడు సెలక్టర్లు పిలుపు కోసం ఆత్రుతగా చూస్తున్నాడు. మరోవైపు ధావన్ స్థానాన్ని యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ భర్తీ చేశారు. దీంతో ఐపీఎల్‌పైనే ఫోకస్ పెట్టాడు మన గబ్బర్. ఇదిలా ఉంటే తాజాగా శిఖర్ ధావన్ కొత్త అవతారమెత్తాడు. బుల్లితెరపై అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు.

శిఖర్ ధావన్ ఓ హిందీ సీరియల్‌లో నటిస్తున్నాడు. ప్రముఖ టీవీ ఛానల్ జీలో ప్రసారమయ్యే హిందీ సీరియల్ 'కుండలి భాగ్య‌'లో పోలీసు అధికా...