భారతదేశం, డిసెంబర్ 6 -- Dhawan Birthday celebrations: టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వన్డే జట్టులో ఆడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మన గబ్బర్ తన పుట్టినరోజును ఢాకాలో జరుపుకున్నాడు. సోమవారం నాడు తన 37 బర్త్ డే‌ను జరుపుకున్నాడు. ఈ వీడియోను ధావన్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తన సహచరులతో కలిసి తన పుట్టినరోజున ఆనందంగా గడిపాడు. కేక్ కట్ చేయడమే కాకుండా సహచరులతో పంచుకున్నాడు. ఈ వేడుకలో కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ కూడా పాల్గొన్నారు.

ప్రస్తుతం ధావన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. బ్యాటింగ్ దిగ్గజం బ్రియన్ లారా, టీమిండియా మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ ధావన్‌కు తమ విషేస్‌ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ప్రస్తుతం ధావన్ బంగ్లాదేశ్...