భారతదేశం, జనవరి 27 -- రాష్ట్రంలో కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుంచి.. అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌ర్గంలో రాజ‌కీయ వేడి త‌గ్గ‌లేదు. కూట‌మి పార్టీలు మ‌ధ్యే పొస‌గ‌క గొడ‌వలు, ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకుంటున్నాయి. అక్క‌డ ఎమ్మెల్యే, మంత్రి సత్య కుమార్ (బీజేపీ), నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ ప‌రిటాల శ్రీ‌రామ్‌కు ప‌డ‌టం లేదు. దీంతో టీడీపీ, బీజేపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర దాడులు కొన‌సాగుతున్నాయి.

ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం సీటు పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లింది. బీజేపీ త‌ర‌పున స‌త్య‌కుమార్ పోటీ చేశారు. టీడీపీ నేత ప‌రిటాల శ్రీ‌రామ్ పోటీ చేయ‌కుండా.. పొత్తు ధ‌ర్మంలో భాగంగా స‌త్య‌కుమార్‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు. అయితే.. స‌త్య కుమార్ వ‌ల్లే ప‌రిటాల శ్రీ‌రామ్ ఎమ్మెల్యే కాలేద‌ని ఆయ‌న అనుచ‌రులు భావిస్తోన్నారు. దీంతో స‌త్య కుమార్‌కు, బ...