భారతదేశం, మార్చి 27 -- Dharmasagar Water: జువ్వాడి చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశ పనుల్లో భాగంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో నిర్మించిన దేవన్నపేట పంప్ హౌజ్ మోటార్ ఎట్టకేలకు ఆన్ అయ్యింది. ఇక్కడ ఏర్పాటు చేసిన మూడు మోటార్లలో ఒక దానిని ఆన్ చేసి జనగామ జిల్లాలో ఎండుతున్న పంటలకు సాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేయగా.. సాంకేతిక లోపాల కారణంగా ఇబ్బందులు తలెత్తాయి.

దీంతో ప్రభుత్వం ఛాలెజింగ్ తీసుకుని పనులు చేయించగా.. ఎట్టకేలకు సమస్యలన్నీ తీరాయి. దీంతో గురువారం తెల్లవారుజామున ఇరిగేషన్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ మేరకు దేవన్నపేట పంప్ హౌజ్ నుంచి గోదావరి నీళ్లు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ధర్మసాగర్ రిజర్వాయర్ కు చేరుకున్నాయి. దాదాపు పది రోజులుగా అధికారులు, ఇతర ఇంజనీర్లు దేవాదుల పంప్ హౌజ్ వద్దన...