భారతదేశం, మార్చి 12 -- Dharmapuri Kalyanam: ధర్మపురిలో వైభవోపేతంగా జరిగిన స్వామివారల కళ్యాణోత్సవంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ తో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

గోదావరినది తీరాన ధర్మపురిలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం గోధూళి సుముహూర్తాన బ్రాహ్మణ సంఘం పక్కనున్న శ్రీమఠం స్థలంలో స్వామి వారి కళ్యాణం కన్నులపండువలా నిర్వహించారు.

ధర్మపురిలో కళ్యాణానికి ముందు ప్రభుత్వం తరపున జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణోత్సవంలో ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి సచ్చితానంద సరస్వతిస్వామిజీ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎస్పీ అశోక్ కుమార్ త...