భారతదేశం, ఫిబ్రవరి 9 -- Dhar Gang Arrest : సౌత్ ఇండియాపై కన్నేసిన మధ్యప్రదేశ్ 'ధార్ గ్యాంగ్' పలు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. ఈ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ ను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. 18 రోజుల క్రింత అనంతపురం శ్రీనగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఈ చోరీకి పాల్పడింది ధార్‌ గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు. దీంతో అనంతపురం ఎస్పీ జగదీశ్‌ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి.

ఈ గ్యాంగ్ పై నిఘాపెట్టిన అనంతపురం పోలీసులు మధ్యప్రదేశ్‌లోని మారుమూల గ్రామాల్లో జల్లెడపట్టారు. చివరికి టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకున్నారు. ఈ గ్యాంగ్‌లోని ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.90 లక్షల విలువ చేసే బంగారం, వజ్రాభరణాలతో పాటు రూ.19.35 లక్షల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో గ...