భారతదేశం, నవంబర్ 28 -- Dhanu Sankranthi 2025: సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాడు. సనాతన ధర్మంలో సూర్యుడిని గ్రహాలకు రారాజు అని అంటారు. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తే 'సంక్రాంతి' అని పిలుస్తారు. దీనిని చాలా ఉత్తమమైన దినంగా భావిస్తారు. ఆ రోజున సూర్యుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. సూర్యుడిని పూజించడం వలన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.

సూర్యుణ్ణి (Sun Lord) ఆరాధిస్తే పురోగతి కలుగుతుంది. వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి. వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు కూడా పూర్తవుతాయి. అడ్డంకులన్నీ తొలగి ఆనందంగా ఉండొచ్చు. ఇక ఇప్పుడు త్వరలో ధను సంక్రాంతి రాబోతోంది. ధను సంక్రాంతి (Dhanu Sankranthi) ఎప్పుడు వస్తుంది? తేదీ, సమయంతో పాటు సూర్యుడిని ఆ రోజు ఎలా ఆరాధించాలో కూడా ...