భారతదేశం, మార్చి 21 -- టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నుంచి విడాకులు తీసుకున్న ధనశ్రీ భార్య నటించిన తాజా ప్రైవేట్ ఆల్బమ్ వైరల్ గా మారింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. ఈ సాంగ్ లో ధనశ్రీ గృహ హింస‌ బాధితురాలిగా కనిపించడం గమనార్హం. చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకున్న రోజే (మార్చి 20) యూట్యూబ్ లో ఈ సాంగ్ రిలీజ్ చేశారు.

టీ-సిరీస్ యూట్యూబ్ ఛానెల్ లో రిలీజ్ చేసిన ఈ వీడియో సాంగ్ వైరల్ గా మారింది. 'దేకా జి దేకా మైనే' అనే ఈ ప్రైవేట్ ఆల్బమ్ లో ధనశ్రీ భర్త చేతిలో మోసపోయిన భార్యగా నటించారు. ఇష్వాక్ మరో లీడ్ రోల్ ప్లే చేశాడు. ఈ సాంగ్ ను జ్యోతి సూరన్ పాడారు. ఈ వీడియోలో ఇష్వాక్, ధనశ్రీ భార్యాభర్తలుగా యాక్ట్ చేశారు. ఈ పాటను జాని రాయడంతో పాటు కంపోజ్ చేశారు. ఈ పాటకు రాహుల్ శెట్టి కొరియోగ్రాఫర్.

ఈ ప్రైవేట్ వీడియో ఆల్బమ్ లో ఇష్వాక్, ధనశ్రీ భా...