భారతదేశం, డిసెంబర్ 28 -- DGP Dwaraka Tirumalarao : 2025 మార్చి 31 తేదీనాటికి పోలీసు కమాండ్ కంట్రోల్ తో 1 లక్ష సీసీ కెమెరాలు అనుసంధానిస్తామని డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే 25 వేల పై చిలుకు సీసీ కెమెరాలను నేర నియంత్రణకు వినియోగిస్తున్నామన్నారు. శనివారం విజయవాడలో మాట్లాడిన ఆయన...గతంతో పోలిస్తే సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. ఈ ఏడాదిలో సైబర్ క్రైమ్ కు సంబంధించి 916 కేసులు నమోదు చేశామన్నారు. మొత్తంగా రూ.1229 కోట్ల మేర నగదు సైబర్ నేరాల ద్వారా చోరీ చేశారన్నారు. డిజిటల్ అరెస్టు అనేది అసలు లేదని, అలాంటి కాల్స్ ను విశ్వసించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కొత్తగా ప్రతీ జిల్లాలోనూ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

"గంజాయి, డ్రగ్స్ కేసుల వ్యవహారంలో ఈగల్ వ్యవస...