భారతదేశం, ఫిబ్రవరి 28 -- Devil OTT Release date: పూర్ణ హీరోయిన్‌గా న‌టించిన హార‌ర్ మూవీ డెవిల్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. మార్చి 1న ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. టెంట్‌కోటా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో డెవిల్‌ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి ఆథియా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కోలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు మిస్కిన్ డెవిల్ మూవీకి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాతోనే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మిస్కిన్ కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేశాడు.

డెవిల్ మూవీలో పూర్ణ‌తో పాటు మ‌రో టాలీవుడ్ హీరో త్రిగుణ్ కీల‌క పాత్ర పోషించాడు. విదార్థ్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. ఫిబ్ర‌వ‌రి 2న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఫెయిలైంది. పూర్ణ‌, త్రిగుణ్ ఇద్ద‌రు తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే కావ‌డంతో టాలీవుడ్‌లోనూ డెవిల్ మూవీని రిలీజ్ చే...