భారతదేశం, మార్చి 28 -- Devadula Project: రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేస్తామని మంత్రి ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. దేవాదుల మూడో దశలో భాగంగా హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేట సమీపంలో నిర్మించిన పంప్ హౌజ్ ను గురువారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజుతో కలిసి ప్రారంభించారు.

ముందుగా హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి దేవన్నపేట కు చేరుకున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డికి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సాగునీటి పారుదల శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు.

ఆ తరువాత దేవన్నపేట శివారులోని దేవాదుల పంపింగ్ స్టేషన్ క...