వరంగల్,తెలంగాణ, మార్చి 23 -- దేవాదుల ప్రాజెక్టు థర్డ్ ఫేజ్ లో భాగంగా హనుమకొండ జిల్లా దేవన్నపేట వద్ద నిర్మించిన పంప్ హౌజ్ ఓపెనింగ్ పనులు రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ గా మారాయి. ఓ వైపు కరువు పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంటలు ఎండిపోతుండగా.. దేవన్నపేట పంప్ హౌజ్ లోని మూడు మోటార్లలో ఒకదానిని ప్రారంభించి, అత్యవసరంగా సాగునీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది.

ఈ మేరకు ఈ నెల 18న రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇతర నేతలు ఒక మోటార్ ను ప్రారంభించేందుకు అక్కడికి వెళ్లారు. కానీ మోటార్లు, పంపింగ్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా మోటార్ ను ఆన్ చేయలేకపోయారు. దీంతోనే సాంకేతిక లోపాన్ని సవరించేందుకు ఆస్ట్రియా దేశం నుంచి ప్రత్యేక టీమ్ ను సంబంధిత కాంట...