Hyderabad, జనవరి 31 -- Deva Movie First Review In Telugu: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు ఇటు తెలుగులో, అటు బాలీవుడ్‌లో వరుసగా పరాజయాలు ఎదురైన విషయం తెలిసిందే. పలు సినిమాల్లో మెయిన్ లీడ్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయి ఆ తర్వాత తొలగించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఇదంతా 2024 సంవత్సరం వరకు. ఇప్పుడు 2025లో వరుస సినిమాలతో పూజా హెగ్డే సత్తా చాటనుంది.

ఈ క్రమంలో 2025లో పూజా హెగ్డే నుంచి వస్తున్న తొలి చిత్రం దేవా. బాలీవుడ్ స్టార్, కబీర్ సింగ్ (అర్జున్ రెడ్డి రీమేక్) ఫేమ్ షాహిద్ కపూర్ హీరోగా నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దేవా. హిందీ చిత్రం దేవా ట్రైలర్, టీజర్, పోస్టర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో దేవాపై అంచనాలు బాలీవుడ్‌లో బాగానే ఉన్నాయి.

రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన దేవా సినిమాలో షాహిద్ కపూర్, పూజా హెగ్డే జోడీగా జత కడి...