భారతదేశం, మార్చి 29 -- Derivative Contracts: కొన్ని సూచీలపై డెరివేటివ్ కాంట్రాక్టుల మార్కెట్ లాట్ ను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సవరించింది. ఈ సర్క్యులర్ 2025 ఏప్రిల్ 25 నుంచి అమల్లోకి వస్తుంది. ఎన్ ఎస్ ఈ సర్క్యులర్ ప్రకారం.. బ్యాంక్ నిఫ్టీ లాట్ పరిమాణం 30 నుంచి 35కు పెరుగుతుంది. నిఫ్టీ మిడ్ సెలెక్ట్ లేదా మిడ్ క్యాప్ నిఫ్టీ పరిమాణం గతంలో 120 ఉండగా, ఇకపై అది 140కి పెరగనుంది. నిఫ్టీ 50, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ నెక్ట్స్ 50 సహా పలు డెరివేటివ్ కాంట్రాక్టుల్లో ఎలాంటి మార్పు లేదని ఎన్ఎస్ఈ మార్చి 28న విడుదల చేసిన సర్క్యులర్లో పేర్కొంది.

ఏప్రిల్ లేదా మే లేదా జూన్ 2025 లో ముగిసే ప్రస్తుత కాంట్రాక్టులు వాటి ప్రస్తుత లాట్ పరిమాణాలనే కొనసాగిస్తాయని, జూలై 2025 గడువుతో ప్రారంభమయ్యే కొత్త కాంట్రాక్టులు సవరించిన లాట్ పరిమాణాలకు లోబడి ఉంటాయని ఎన...