Hyderabad, ఫిబ్రవరి 5 -- డిప్రెషన్. ఇప్పుడు ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న మానసిక సమస్య. విద్యార్థులు, ఉద్యోగులు అధికంగా డిప్రెషన్ కు గురవుతున్నారు. అయితే డిప్రెషణ్ బారిన పడినా కూడా ఆ విషయాన్ని ఎంతో మంది గుర్తించలేకపోతున్నారు. డిప్రెషన్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి చికిత్స ఎలా చేస్తారు? వంటి అంశాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది.

రోజువారీ పనులు వల్ల విసుగు, విచారం వంటివి వస్తాయి. సాధారణ విసుగు కొద్దిసేపు మాత్రమే ఉంటాయి. ఇది కాసేపటికి మాయమవుతాయి. ఇది మీ దినచర్యను, ఆరోగ్యాన్ని పెద్దగా ప్రభావితం చేయదు. కానీ డిప్రెషన్ భిన్నమైనది.

డిప్రెషన్ అనేది ఒక మానసిక రుగ్మత. ఈ వ్యాధి అకస్మాత్తుగా ఎవరికీ రాదు. ఇది క్రమేపీ అభివృద్ధి చెందుతుంది. డిప్రెషన్ ను వైద్యులు మూడు విధాలుగా వర్ణిస్తారు. ఇది ఎంత తీవ్రమైనదనే దానిపై ...