భారతదేశం, మార్చి 23 -- స్టాలిన్ ప్రభుత్వం వెయ్యి కోట్ల లిక్కర్ స్కాం చేసిందని.. కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కేరళలోనూ లిక్కర్ స్కాం బయటపడిందని.. ఆప్, బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ లిక్కర్ స్కాం చేసి జైలుకు పోయాలని విమర్శించారు. వీళ్లంతా కలిసి డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతూ.. మోదీ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ జీడీపీకి, పార్లమెంట్‌లో ప్రాతినిధ్యానికి లింకు పెట్టడంపై మండిపడ్డారు.

'చెన్నైలో స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లిక్కర్ దొంగల ముఠా ఒకే చోట సమావేశమై విచిత్రమైన తీర్మానం చేశారు. దేశ జీడీపీలో దక్షిణాది వాటా 36 శాతం ఉన్నందున పార్లమెంట్‌లో కూడా దక్షిణాదికి 36 శాతందాకా వాటా ఇవ్వాలని అడుగుతున్నరు. ఇదేం విచిత్రం? దేశ జీడీపీకి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యానికి సంబంధమేంది? అట్లనుకుంటే తెలంగాణ జీడీపీలో ...