భారతదేశం, మార్చి 22 -- జ‌నాభా నియంత్రణపై కేంద్ర‌ నిబంధనలను దక్షిణాది రాష్ట్రాలు కఠినంగా పాటించాయ‌ని.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే కారణం ద‌క్షిణాది రాష్ట్రాల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంద‌ని, జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు క‌చ్చితంగా త‌గ్గుతాయ‌ని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు.

జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడాల‌ని ప్ర‌ధాన‌మంత్రికి సూచించారు. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలన్నారు జగన్. లోక్‌సభ, రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా.. నియోజకవర్గాల పునర్విభజన చేప‌ట్టాల‌ని తన లేఖలో కోరారు. పార్లమెంటులో సమాన భాగస్వామ్యం కోసం రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించకుండా డీలిమిట...