తెలంగాణ,హైదరాబాద్, మార్చి 13 -- నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) విషయంలో కేంద్రం వైఖరిపై డీఎంకే పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే కార్యాచరణను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా మార్చి 22వ తేదీన చెన్నైలో కీలక సమావేశాన్ని తలపెట్టింది. ఇందుకు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో పాటు పలువురు నేతలను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా.డీఎంకే నేతల బృందం హైదరాబాద్ చేరుకుంది.

ఇవాళ డీఎంకే నేతల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. డిలిమిటేషన్ తో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సమావేశానికి హాజరుకావాలని కోరింది. తమిళనాడు రాష్ట్ర మంత్రి టీకే నెహ్రూ ఆధ్వర్యంలోని డీఎంకే ప్రతినిధుల బృందం ఆహ్వానాన్ని అందించింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. సరైన విధానాలు లేకుండా లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రా...