భారతదేశం, ఫిబ్రవరి 16 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యూదిల్లీ రైల్వే స్టేషన్​ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు తాజాగా పలు కీలక విషయాలను వెల్లడించారు. రైళ్ల అనౌన్స్​మెంట్​లో అనిశ్చితి వల్ల ఈ విషాదరకర ఘటన జరిగిందని దిల్లీ పోలీసులు తెలిపారు. పైగా.. ఆ సమయంలో ఉన్న రైళ్లకు "ప్రయాగ్​రాజ్"​ పేరు ఉండటంతో మహా కుంభమేళాకు వెళుతున్న యాత్రికుల్లో గందరగోళాన్ని సృష్టించిందని వివరించారు.

మహా కుంభమేళా నేపథ్యంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ తొక్కిసలాట ఘటనపై అధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. స్థానిక సీసీటీవీ ఫుటేజ్​ని పరిశీలించారు, అక్కడ ఉన్న అధికారులను విచారించారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తులోని పలు కీలక విషయాలను తాజాగా వెల్లడించారు.

"ప...