భారతదేశం, ఫిబ్రవరి 16 -- మహా కుంభమేళా నేపథ్యంలో న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి ప్రయాగ్​రాజ్​కు వెళ్లే రెండు రైళ్లు ఆలస్యం అవ్వడం, అనంతరం రైల్వే స్టేషన్​లో భారీ రద్దీ నెలకొనడంతో కొద్దిసేపటికే తొక్కిసలాట జరిగింది. న్యుదిల్లీ రైల్వే స్టేషన్​లో జరిగిన ఈ తొక్కిసలాటలో 16మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు.

రైల్వేశాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో శనివారం రాత్రి 9:30 గంటలకు ప్లాట్​ఫామ్​ నెంబర్​ 14,15 పై ఈ ఘటన జరిగింది. మహా కుంభమేళా కోసం ప్రయాగ్​రాజ్​కు వెళ్లేందుకు ప్యాసింజర్లు రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. రద్దీ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.

కొద్దసేపటికే ప్యాసింజర్ల తాకిడి మరింత పెరగడంతో న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటతో అనేక మంద...