భారతదేశం, జనవరి 5 -- దిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 14ఏళ్ల బాలుడిపై ఏడుగురి బృందం దాడి చేసి చంపేశారు! వీరిలో ఐదుగురు స్కూల్​మేట్స్​ కూడా ఉన్నారు.

తూర్పు దిల్లీలోని దిల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల బాలుడిపై ఐదుగురు స్కూల్ మేట్స్, ఇద్దరు పెద్దలు దాడి చేయడంతో శుక్రవారం సాయంత్రం అతను మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

పాఠశాల వెలుపల జరిగిన దాడిలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తొడపై కత్తితో పొడిచారు. తీవ్ర రక్తస్రావంతో అతను మృతి చెందాడు. 9, 12 తరగతులకు చెందిన 14 నుంచి 17 ఏళ్ల వయసున్న ఐదుగురు మైనర్లను, 19, 31 ఏళ్ల వయసున్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు గణేష్ నగర్ నివాసి కాగా, నిందితులు మండవాలి ప్రాంతంలో ఉంటున్నారు.

బాధితుడు, పట్టుబడిన తోటి విద్యార్థులకు మధ్య వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ ఘటన జరిగిందన...