భారతదేశం, నవంబర్ 29 -- Delhi High Court: ''తన కుమారుడి కోసం ఒక తల్లి, కూతురితో పాటు ఉక్రెయిన్ నుంచి భారత్ వచ్చింది. ముందు వారిని కలవనివ్వండి. కాసేపు సంతోషంగా గడపనివ్వండి. ఆ మూడున్నరేళ్ల పిల్లవాడి చుట్టూ సంతోష వాతావరణం ఉండేలా చూడండి'' అని మంగళవారం ఢిల్లీ హై కోర్టు వ్యాఖ్యానించింది.

కేసు వివరాల్లోకి వెళితే. ఉక్రెయిన్ మహిళ తన భర్తతో ఉక్రెయిన్ లో విడాకులు తీసుకుంది. ఉక్రెయిన్ లోని కోర్టు విడాకులు మంజూరు చేస్తూ.. మైనర్లైన వారి కుమారుడు, కూతురి సంరక్షణ బాధ్యతను తల్లికి అప్పగించింది. పిల్లలను చూసి, కాసేపు గడిపే అవకాశం ఆ తండ్రికి కల్పించింది. దాంతో ఆ తండ్రి అప్పుడప్పుడు వచ్చి పిల్లలతో కాసేపు సమయం గడిపి వెళ్తుండేవాడు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత.. ఒక రోజు వారి ఇంటికి వచ్చిన ఆ తండ్రి.. మూడున్నరేళ్ల వారి కొడుకును వాకింగ్ కని బయటకు తీ...