భారతదేశం, మార్చి 22 -- Justice Yashwant Varma: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రతికూల నివేదిక రావడంతో అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ యశ్వంత్ వర్మను బదిలీ చేయడానికి సిఫార్సులు చేసింది. జస్టిస్ వర్మ 2021 అక్టోబర్ లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారని తెలిపింది.

ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ నివాస బంగ్లాలో ఇటీవల అగ్నిప్రమాదం సంభవించింది. అప్పుడు సహాయక చర్యలు చేపట్టిన సమయంలో ఆ బంగాల్లో భారీ మొత్తంలో నగదు కనిపించింది. ఆ నగదును సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ ఢిల్లీలో లేరని, ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాపక దళం, పోలీసులకు ఫోన్ చేశ...