భారతదేశం, ఫిబ్రవరి 8 -- Delhi assembly elections results analysis: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన కాంగ్రెస్ కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది.ఈ రెండు పార్టీలు లోక్ సభ ఎన్నికల సమయంలో ఏర్పడిన విపక్ష కూటమి 'ఇండియా' లో ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి.

ఆప్, కాంగ్రెస్ లు కలిసి పోటీ చేస్తే, చాలా స్థానాల్లో బీజేపీని ఓడించగలిగేవారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉదాహరణకు అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ కు కేజ్రీవాల్ కన్నా సుమారు 4 వేలు ఓట్లు ఎక్కవ వచ్చాయి. అదే స్థానంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సందీప్ దీక్షిత్ కు 4,568 ఓట్లు పోలయ్యాయి. అంటే, ఒకవేళ, కాంగ్రెస్, ఆప్ కలిసి ఎన్నికల్లో ...