భారతదేశం, ఫిబ్రవరి 8 -- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. రౌండ్‌ రౌండ్‌కు మారుతున్న ఆధిక్యాలతో ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు వెనుకంజలో ఉన్నారు. ఊహించని అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. కానీ.. కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో హస్తం పార్టీపై పంచ్‌లు పేలుతున్నాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ సెటైర్లు వేశారు. 'బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై సెటైర్లు వేస్తున్నారు.

ఇటు తెలంగాణ ప్రభుత్వంపైనా కేటీఆర్ ఫైర్ అయ్యారు. 'తొ...