భారతదేశం, ఫిబ్రవరి 8 -- బీఆర్ఎస్ భస్మాసుర హస్తమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయానికి కారణం అని.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ కవిత, కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్.. ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలకు దూరం చేసిందన్నారు. ఢిల్లీ ఫలితాలనుద్దేశించి రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. అహంకారపూరితమైనవి అని ఫైర్ అయ్యారు. ఈ అహంకారాన్ని అణచివేసేందుకే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పారని విమర్శించారు. అధికార పక్షమైన, ప్రతిపక్షమైనా కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ పోరాట పంథానే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ప్రజా సంక్షేమమే అని వివరించారు.

'బీఆర్ఎస్ భస్మాసుర హస్తం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని నిండా ముంచింది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితతో కేజ్రీవాల్ లిక్కర్ వ్యాపారం ఆమ్ ఆద్మీ ప...