భారతదేశం, ఫిబ్రవరి 8 -- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఢిల్లీలో మోదీ డబుల్‌ ఇంజిన్‌ నినాదం పనిచేసింది. లిక్కర్‌ స్కామ్‌, అవినీతి ఆరోపణలు ఆప్‌ కొంపముంచాయి. ఎన్నికలవేళ ఆమ్‌ఆద్మీ పార్టీని సీనియర్‌ నేతలు వీడారు. అటు ఓటర్లపై యమునా నది కాలుష్యం తీవ్ర ప్రభావం చూపింది. యమునా కాలుష్యానికి కేజ్రీవాలే కారణమని బీజేపీ క్యాంపెయిన్ చేసింది. ఢిల్లీ ప్రజలను బీజేపీ గ్యారంటీలు ఆకట్టుకున్నాయి. దీంతో దళిత, ఓబీసీ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుచూపారు. ఆప్‌, కాంగ్రెస్‌ విడిగా పోటీచేయడంతో బీజేపీ లాభపడింది.

తాజా ఎన్నికల ఫలితాలపై రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఢిల్లీ ఫలితాలు మోదీపై ప్రజల విశ్వాసానికి నిదర్శనం. మోదీ లక్ష్యాలను అందుకోవడంలో ఢిల్లీ పాత్ర కీలకం. ఢిల్ల...