భారతదేశం, ఏప్రిల్ 14 -- దేశ రాజధాని దిల్లీలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు మైనర్లు కలిసి నడిరోడ్డు మీద ఓ 17ఏళ్ల బాలుడిని చంపేశారు. వీరికి ముందే పరిచయం ఉందని, స్కూల్​లో జరిగిన గొడవపై కోపంతో మైనర్లు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు వెల్లడించారు.

ఆగ్నేయ దిల్లీలోని గోవింద్​పురిలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ముగ్గురు మైనర్లు 17 ఏళ్ల బాలుడిని కత్తితో పొడిచి చంపారని, నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

17 ఏళ్ల బాలుడు తమ సీనియర్ అని, తమను కొట్టాడని, అందుకే ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నామని నిందితుల్లో ఒకరు చెప్పాడు. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో 17 ఏళ్ల యువకుడు ఇంటికి తిరిగి వెళుతుండగా ఓఖ్లా ఎస్టేట్ రోడ్డు సమీపంలో అతడిని మైనర్లు అడ్డుకున్నారు. అతనిపై దాడి చేశారు. 16 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు ఆ బాలుడిని గొంతు న...