భారతదేశం, ఫిబ్రవరి 5 -- Delhi assembly elections exit polls: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్ కంటే బీజేపీదే పైచేయి అవుతుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 8న కౌంటింగ్ అనంతరం ఎన్నికల సంఘం అధికారిక ఫలితాలను ప్రకటించనుంది. ఓటు వేసిన తర్వాత ఓటర్లు బయటకు వచ్చినప్పుడు వారి ఇంటర్వ్యూల ఆధారంగా ఎన్నికల సర్వే సంస్థలు చేసే అంచనాలను ఎగ్జిట్ పోల్స్ అంటారు. ఇవి వాస్తవ ఫలితాల నుండి విస్తృతంగా మారవచ్చు.

70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ మార్కు 36. ప్రస్తుతం ఆప్ కు 62 మంది, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు ఒక్కరు కూడా లేరు. ఢిల్లీ అసెంబ్లీకి బుధవారం ఎన్నికలు జరగ్గా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీలో 1.55 కోట్ల మంది ఓటర్లు ఉండగా, బుధవారం సాయంత్రం 5 గంటల వరకు దాదా...