భారతదేశం, ఫిబ్రవరి 5 -- Delhi Assembly elections: హోరాహోరీగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్, కొడిమో సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో ఆసక్తికరమైన అంశాలు వెలువడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ల మధ్య త్రిముఖ పోటీ జరిగినా ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యనే ఉంది. దశాబ్ద కాలంపైగా అధికారంలో ఉన్న ఆప్ కు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు తప్పదని, అధికారానికి 27 ఏళ్లు దూరంగా ఉన్న బీజేపీకి గెలిచే అవకాశాలున్నాయని ఎగ్టిట్ పోల్ లో వెల్లడైంది.

ఢిల్లీ ఎన్నికలను అంచనా వేయడానికి గత నెల రోజులుగా ట్రాకర్ పోల్స్ నిర్వహిస్తున్న పీపుల్స్ పల్స్, కొడిమో సంస్థలు ఎన్నికలు జరిగిన ఫిబ్రవరి 5వ తేదీన ఎగ్జిట్ పోల్ చేపట్టింది. బీజేపీ 51 -60 స్థానాలు, ఆప్ 10 -19 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్టు ఎగ్జిట్ పోల్ల...