Hyderabad, మార్చి 17 -- ఏఆర్ రెహమాన్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన అభిమానులు ఎంతో ఆందోళన చెందారు.మార్చి 16న ఏఆర్ రెహమాన్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఏఆర్ రెహమాన్ కు మెడనొప్పి, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించాయని అపోలో ఆస్పత్రి మెడికల్ బులెటిన్ లో పేర్కొంది. ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. రంజాన్ వేళ చేసే ఉపవాసాల వల్ల కూడా డీహైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.

ఉపవాసాల సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి శరీరం హైడ్రేటెడ్ గా ఉండాలని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. డీహైడ్రేషన్ సమస్య ఏమిటి, దాని లక్షణాలు, నివారణ చర్యలు ఏంటో తెలుసుకుందాం.

శరీరంలో నీరు అవసరానికి సరిపడా లేకపోతే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. వేసవిలో డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా వచ్చే అనారోగ్యం. దీనిలో శ...