Hyderabad, మార్చి 26 -- 39 ఏళ్ల దీపికా పదుకొణె ఇప్పటికీ యవ్వనంగా, మెరుస్తూ కనిపించడానికి రహస్యం కేవలం ఒక జ్యూస్ అని మీకు తెలుసా? అవును ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ బీట్‌రూట్‌తో తయారుచేసిన డీఐవై జ్యూస్‌‌తో ఆమె చర్మాన్ని ఎల్లప్పుడూ అందంగా, ఆరోగ్యంగా కాపాడుతుందట. ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా తాజాగా ఓ వీడియోలో దీపికా చర్మ రహస్యాన్ని తెలిపారు. ఈమె దీపికా నుండి కత్రీనా కైఫ్ వరకూ చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు న్యూట్రిషనిస్ట్‌గా పనిచేశారు. 2018లో నటుడు రణవీర్ సింగ్‌తో దీపికా వివాహానికి ముందు శ్వేతా ఈ బ్యూటీకి న్యూట్రిషనిస్ట్‌గా వ్యవహరించింది. అప్పటి ఆమె స్కిన్‌కేర్ రొటీన్ గురించి శ్వేతా చెప్పకొచ్చారు.

దీపికా చర్మ రహస్యం గురంచి శ్వేతా ఏం చెప్పిందంటే.. "నేను దీపికా పదుకొణెతో ఆమె వివాహానికి ముందు పనిచేశాను. ఆమెకు ఒకే ఒక్క లక్ష్యం ఉండేది. ...