భారతదేశం, ఏప్రిల్ 18 -- పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌య‌రెడ్డి హీరోహీరోయిన్లుగా న‌టించిన డియ‌ర్ ఉమ మూవీ ఏప్రిల్ 18న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి సాయిరాజేష్ మ‌హాదేవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సుమ‌య రెడ్డి క‌థ‌ను అందిస్తూ నిర్మించిన ఈ మూవీ ఎలా ఉందంటే?

ప‌ల్లెటూరిలో పుట్టి పెరిగిన ఉమ (సుమయ రెడ్డి) క‌ష్ట‌ప‌డి ఎంబీబీఎస్‌లో సీటు సంపాదిస్తుంది. సొంతంగా ఓ హాస్పిట‌ల్ నిర్మించి తండ్రి క‌ల‌ను నెర‌వేర్చాల‌ని అనుకుంటుంది. దేవ్‌కు(పృథ్వీ అంబ‌ర్‌) మ్యూజిక్ అంటే ప్రాణం. రాక్‌స్టార్ కావాల‌ని క‌ల‌లు కంటాడు. మ్యూజిక్ కార‌ణంగా చ‌దువులో వెనుక‌బ‌డిపోతాడు. కాలేజీలోనే త‌న‌కు ప‌రిచ‌య‌మైన ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. మ్యూజిక్ కార‌ణంగానే దేవ్‌కు ఆ అమ్మాయి బ్రేక‌ప్ చెప్పి వెళ్లిపోతుంది.

ఆ బ్రేక‌ప్ బాధ‌లో తాగేసి ఇంటికి వెళ్లిన దేవ్‌ను తండ్...