Hyderabad, మార్చి 3 -- David Warner Telugu Movie: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుసు కదా. ఒకప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున కెప్టెన్ అయిన అతడు.. తెలుగు సినిమాలపై మనసు పారేసుకున్నాడు. ఇక్కడి హీరోలను ఇమిటేట్ చేస్తూ ఎన్నో రీల్స్ కూడా చేసేవాడు. మొత్తానికి ఇప్పుడతడు ఓ తెలుగు సినిమాతోనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు.

టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న రాబిన్‌హుడ్ (Robinhoot) మూవీలో డేవిడ్ వార్నర్ నటిస్తున్నట్లు నిర్మాత రవిశంకర్ వెల్లడించాడు. సోమవారం (మార్చి 3) హైదరాబాద్ లో కింగ్‌స్టన్ మూవీ ఈవెంట్ కు హాజరైన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై రవిశంకర్.. ఈ లీక్ ఇచ్చాడు. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఈ రాబిన్‌హుడ్. గతంలో భీష్మలాంటి హిట్ ఇచ్చిన జోడీ ఇది.

ఈ సినిమా గురించి చిన్న లీక్ ఇవ్వాల్సిందిగా యా...