Hyderabad, మార్చి 28 -- David Warner Remuneration: డేవిడ్ వార్నర్ తెలుసు కదా. ఆస్ట్రేలియా క్రికెటరే అయినా సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి తెలుగు వాళ్లకు దగ్గరయ్యాడు. తాను వ్యక్తిగతంగా తెలుగు సినిమాలకు బాగా ఆకర్షితుడయ్యాడు. ఇప్పుడతడు నితిన్ నటించిన రాబిన్‌హుడ్ మూవీలో నటించి ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా శుక్రవారం (మార్చి 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన రాబిన్‌హుడ్ మూవీలో డేవిడ్ వార్నర్ మూడు నిమిషాల పాటే ఉండే ఓ చిన్న అతిథి పాత్రలో కనిపించాడు. దీనికోసమే అతడు ఏకంగా రూ.3 కోట్లు అందుకున్నట్లు ఓటీటీ ప్లే రిపోర్టు వెల్లడించింది. నిజానికి ఈ సినిమాలో వార్నర్ నటించినట్లు ఈ నెల మొదట్లోనే ప్రొడ్యూసర్ రవిశంకర్ చెప్పి ఆశ్చర్యపరిచాడు. దీంతో అప్పటి నుంచే అతని రోల్ ఏంటి? ఎలా నటించాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఈ సినిమాలో అ...