Hyderabad, మార్చి 7 -- పెళ్లి ఒక అమ్మాయి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తన ఇంటిని వదిలి అత్తమామల ఇంటికి వచ్చాక అక్కడ ఇమిడేందుకు కష్టపడుతుంది. ఇతర కుటుంబ సభ్యులు కూడా కొత్త కోడలు ఇంట్లో కలుపుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఆ సమయంలో ఎంతో నిశ్శబ్దంగా ఉండాలి. లేకుంటే వాదనలు, గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కోడలికి ఉండే కొన్ని అలవాట్లు, లక్షణాలు ఆ కుటుంబాన్ని విచ్చినం చేసే అవకాశం ఉంది. ఎంత సంతోషకరమైన కుటుంబాన్ని అయినా కోడలికి ఉండే ఈ అలవాట్లు నాశనం చేయవచ్చు.

ఎప్పుడూ ఇతరుల గురించి చెడుగా మాట్లాడే అలవాటు ఉన్న వ్యక్తిని ఇంటికి కోడలిగా తెచ్చుకోకూడదు. ఒకవేళ మీ కోడలికి అలాంటి అలవాట్లు ఉన్నా కూడా వాటిని వీలైనంతవరకు నచ్చజెప్పి తగ్గించడం మంచిది. ఇతర కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడటం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. ఒక కోడలు తన అత్తగారి గురించి, ...