భారతదేశం, డిసెంబర్ 4 -- పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. పౌర్ణమి నాడు చంద్రుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. కార్తీక పౌర్ణిమ, శ్రావణ పౌర్ణమికి ఎలా విశిష్టత ఉన్నాయో అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు దత్త జయంతి. అందరికీ గురు దత్తునిగా, దత్తాత్రేయ స్వామిగా తెలిసిన దత్తాత్రేయ జయంతి మార్గశిర పౌర్ణమి నాడు వస్తుంది.

ఈ ఏడాది దత్తాత్రేయ జయంతి డిసెంబర్ 4 అంటే ఈరోజు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఈ దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. ఇక ఈరోజు దత్తాత్రేయుని జననం గురించి, దత్తాత్రేయుని జయంతి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

దత్తాత్రేయుడు అత్రి మహర్షికి పుట్టాడు. ఈయనలో ఉన్న జ్ఞానం అపారమైనది. ఈయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. అందుకే గురువుగా చాలా మంది భావించి ఆశ్రయించారు. తన భక్తులైనటువంటి యదు, ...