Hyderabad, ఏప్రిల్ 2 -- పుచ్చకాయలు వేసవికాలంలో మాత్రమే దొరుకుతాయి. కాబట్టి మీరు కచ్చితంగా వేసవిలో తినాల్సిన పండ్లలో పుచ్చకాయ మొదటి స్థానంలో ఉంటుంది. ఇది వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది.

మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలపడేలా యాంటీ ఆక్సిడెంట్లను, ఖనిజాలను, విటమిన్లను అందిస్తుంది. ముఖ్యంగా పుష్కలంగా నీటిని ఇస్తుంది. అందుకే పుచ్చకాయను తినడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండడమే కాదు. అనేక వ్యాధుల నుండి కూడా రక్షణ లభిస్తుంది.

పుచ్చకాయను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మంచిది. మీడియం సైజ్ లో ఉండే ఒక పుచ్చకాయను తెచ్చి అందులో సగం ముక్కను ఒకరోజులో తినేయవచ్చు. ఇలా ప్రతిరోజు పుచ్చకాయలో సగం ముక్క తినడం వల్ల మీ శరీరంలో ఎలాంటి ప్రభావాలు కలుగుతాయో, ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకోండి.

పుచ్చకాయలో 92 శాతం నీరే ఉంటుంది. ఇది ...